• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సత్యం రాజు విచారణకు సెబీ పిటిషన్

By Staff
|

Ramalinga Raju
న్యూఢిల్లీ: సత్యం అవకతవకలపై సత్యం ఛైర్మన్ రామలింగరాజును విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెబి సోమవారం సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేసింది. హైదరాబాద్‌లో దీనికోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో సుప్రీంకోర్టులో సెబి పిటీషన్‌ వేసింది. దీనిపై రేపు (మంగళవారం) విచారణ జరుగుతుంది. సెబీ తరఫున సోలిసిటర్ జనరల్ జి.ఇ.వాహనవతి ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు.

జ్యుడిష్యల్ కస్టడీలో ఉన్న రామలింగ రాజును విచారించేందుకు తమకు హైకోర్టు అనుమతి నిరాకరించడాన్ని సెబీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రామలింగరాజును, ఆయన సోదరుడు బి.రామరాజును విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనవరి 30వ తేదీన అనుమతి నిరాకరించింది. రామలింగరాజును విచారించేందుకు తమకు సెబీకి హక్కు ఉందని వాహనవతి సుప్రీంకోర్టు ముందు వాదించారు. రామలింగరాజును పోలీసులు హైదరాబాదులో జనవరి 9వ తేదీన అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X