వైయస్ మార్కు ఫలితాల అంచనా

రాయలసీమ, కోస్తా జిల్లాల్లో తెలుగుదేశం, పిఆర్పీ 15 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుంటాయని ఆయన చెప్పారు. చిరంజీవికి శ్రీకాకుళం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర సమితి బలహీనపడుతోందని ఆయన అన్నారు. మహాకూటమికి సిద్ధాంతులు ఉన్నారు తప్ప సిద్ధాంతాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తమకు 25 లోకసభ స్థానాలు వస్తాయని, తెలంగాణలో 8 నుంచి 12 సీట్లు గెలుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications