చిరూ, నీ పని చూసుకో: నారాయణ
తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన పని తాను చూసుకోవాలని, తన పార్టీ నిర్మాణాన్ని చూసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ సలహా ఇచ్చారు. మహాకూటమిపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెసు పార్టీని ఓడించడానికే మహా కూటమి ఏర్పడిందని, సిద్ధాంత విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెసును వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి తాము ఒక్కటయ్యామని ఆయన చెప్పారు. మహాకూటమిలోని పార్టీలకు ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయని ఆయన అన్నారు.
కాంగ్రెసును ఆ పార్టీ సిద్ధాంతాలే ఓడిస్తాయని, అందులో తాము కీలక పాత్ర పోషిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ మిత్రపక్షాల మధ్య స్నేహపూర్వక పోటీలు కూడా ఉండవని, స్నేహపూర్వక పోటీలకు తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన ఘాటుగా విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications