వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ ది విలన్ నవ్వు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సత్యం కుంభకోణంతో ప్రభుత్వానికి సంబంధం ఉంది కనుకే విచారణ సజావుగా సాగటంలేదని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తనంతతానుగా ఆయన లొంగిపోతే అరెస్టు చేశారుతప్ప ప్రభుత్వం తానుగా అరెస్టు చేయలేదని అన్నారు. సత్యం, మేటాస్ వ్యవహారాలపై చర్చలో భాగంగా ఆయన సోమవారం శాసనసభలో మాట్లాడారు. ఆ తరువాత కూడా రక్షించేందుకే రామలింగరాజును బయటకు రానీయటం లేదన్నారు. మేటాస్‌తో ప్రభుత్వం కుమ్మక్కు అయిందని అందుకే పనులు వారికే ఇస్తామని అంటున్నారన్నారు. రామలింగరాజుతో మాట్లాడేందుకు సెబి అధికారులు చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సిరావటం పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. సెబి తరపున విచరణ చేసిన దామోదరన్‌ రామలింగరాజు రక్షణ వలయంలో ఉన్నారని వ్యాఖ్యానించటాన్ని గుర్తు చేశారు.

కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడిచేసి విచారణ జరగనీయటం లేదన్నారు. అతి పెద్ద కార్పొరేట్‌ కుంభకోణం అయిన సత్యంపై ప్రభుత్వ తీరు గర్హనీయమని అన్నారు. ప్రపంచబ్యాంకుతో సహా అంతా సత్యంలో అసత్యాలు ఉన్నాయంటుంటే ప్రభుత్వం గట్టిగా మాట్లాడేందుకే భయపడుతోందని అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై శ్రీధరన్‌ అప్పుడే అవినీతి జరిగిందని అన్నారని ఆయనపై పరువునష్టం దావా వేస్తామని అన్నారని, ఇప్పుడు తెలుగుజాతి పరువే పోయిందని అన్నారు.

సత్యం విషయంలో సెబి, ఆర్బీఐ ఉల్లంఘనలు జరిగాయని ఆయన ఆరోపించారు. సత్యం అవకతవకలు బయట పడిన తర్వాత కూడా మేటాస్ పనులు రద్దు చేయకపోవడం ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సత్యం సంస్థ ఎంతో ప్రగతి సాధించిందని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కూమారుడు వైయస్ జగన్ నేతృత్వంలోని సాక్షి దినపత్రికలో పెట్టుబడుల వ్యవహారాన్ని, దాని వాటాలు కొనుగోలు వ్యవహారాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తాను ప్రసంగిస్తున్న సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి నవ్వడంపై తీవ్రంగా ప్రతిస్పందించారు. వైయస్ ది విలన్ నవ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాపం పండిందని ఆయన అన్నారు. వైయస్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి కె. రోశయ్య కళ్లు మూసుకుని దృతరాష్ట్రుడిలా వ్యవహరించడం వల్లనే ముఖ్యమంత్రి, ఆయన బంధువుల, సన్నిహితుల అక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిని ముందుగా హెచ్చరించి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X