ఏడుపాయల్లో శివరాత్రి ఉత్సవాలు
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో ఉపవాస దీక్షలతో సోమవారం ప్రారంభమయ్యాయి. శివరాత్రి పర్వదినం రోజైన ఈ రోజు ఉదయం నుంచే ఏడుపాయలకు చేరుకున్న భక్తులు గరుడ గంగలో మంజీరా స్నానాలను ఆచరించి ఉపవాస దీక్షలు చేపడతారు.
సాయంత్రం శివాలయంలో ఉపవాస దీక్షలు వదిలిన భక్తులు అమ్మవారి సన్నిధిలో దైవ చింతనలో మునిగిపోయి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినం సోమవారం కలిసిరావడంతో కొత్తగా ఉప వాస దీక్షలు పూనేవారిసంఖ్య అధికంగా ఉంటుంది. మరుసటి రోజు బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉండడంతో మొక్కుబడులు చెల్లించుకోవడానికి భక్తులు తెల్లవారేసరికి జాతరలో కొలువుదీరుతారు. మొక్కుబడులను చెల్లించుకొని మేకపోతులను బలిస్తారు. బోనాల ఊరేగింపు, పోతరాజుల ఈల గోలలు, శివసత్తుల పూనకాలతో జాతర ప్రాంతం అమ్మవారి నామస్మరణతో దద్దరిల్లిపోతుంది.
ఆలయ ప్రాంగణంలోని వెళ్లే భక్తులను మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేసి పోలీసులు అణువణువునా తనిఖీ చేస్తున్నారు. జాతర ప్రాంతంలో మెదక్ డిఎప్పీ భాస్కర్‌రెడ్డి, సిఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పాపన్నపేట ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు, సిబ్బంది గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఏడుపాయల జాతరకు తరలి వచ్చే భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా పాలక మండలి చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇవో మోహన్‌రెడ్డి, డైరెక్టర్లు వెంకటామాగౌడ్, రాంచెందర్, కిషన్‌రెడ్డి, రామకిష్టయ్య, రామప్ప దావిద్, శారదాబాయి, రమేశ్, చిన్నబర్నయ్యలతో పాటు పాలక ఆలయ సిబ్బంది సేవలందిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications