మహిళల ప్రగతికి మైమరిచిన సోనియా

మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. స్వయంసమృద్థిలో ఈ రాష్ట్ర మహిళలకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ సాటిరారని, మీరంతా ప్రపంచానికే ఆదర్శమని సోనియా అన్నారు. ఇక్కడి మహిళల ఆత్మవిశ్వాసం చూస్తుంటే తనకు ఎంతో సంతోషం కలుగుతుంటుందని సోనియా అన్నారు.
మహిళలకు పెన్షన్ ఇవ్వాలనే ఆలోచనే ఎంతో గొప్పదని ఇలాంటి ఆలోచన చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నానని ఆమె అన్నారు. మహిళలపై ఇక్కడి ప్రభుత్వ ఆదరణ అపూర్వమని అన్నారు. అనంతరం ఆమె పలువురు మహిళలకు బీమా పత్రాలు అందజేశారు. వారి అనుభవాలు, స్పందన విన్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం కంది బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications