'అల్లరే అల్లరి' నిర్మాత బషీర్ అరెస్టు
హైదరాబాద్: అల్లరే అల్లరి సినిమా నిర్మాత బషీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఫోర్జరీకి పాల్పడ్డాడనే ఆరోపణపై అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యుడి పేర నకిలీ పత్రాలు సృష్టించి బషీర్ పలు బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు అప్పులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బషీర్ కు అప్పులు ఇచ్చిన బ్యాంకు అధికారులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications