సీఎంతో సినీనటుడు కృష్ణ భేటీ
హైదరాబాద్: సినీనటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ కృష్ణ ఈరోజు సీఎంను కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన కొంతసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయనకు గాని ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావుకు గాని టిక్కెట్లు లభించటం ఖాయమని అందరూ భావించగా ఇద్దరికీ టిక్కెట్లు రాలేదు. ఈ నేపథ్యంలో కృష్ణ రాక ఆసక్తికరంగా మారింది. ఎప్పటినుంచో తమ కుటుంబం కాంగ్రెస్‌కోసం పనిచేస్తుండగా ఇప్పుడు తమకు మొండిచేయి చూపటంపై ఆదిశేషగిరిరావు అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications