లేడీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని ఎసి గార్డ్స్ లో అపార్ట్ మెంట్ టెర్రాస్ నుంచి కిందికి దూకి 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. కోల్ కత్తాకు చెందిన అనన్య ఛటర్జీ ఎసి గార్డ్స్ లోని నజర్ అపార్ట్ మెంటులో ఒంటరిగా ఉంటోంది. మాదాపూర్ లోని ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తోంది.
తెల్లవారు జామున పన్నెండున్నర గంటల ప్రాంతంలో అనన్య ఐదంతస్థుల అపార్ట్ మెంట్ టెర్రాస్ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. రక్తం మడుగులో పడి ఉన్న అనన్య శవాన్ని సెక్యూరిటీ గార్డ్ గుర్తించి తమకు తెలియజేసినట్లు నాంపల్లి పోలీసు ఇన్ స్పెక్టర్ యు. ఉమేందర్ చెప్పారు. జీవితంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె ఒక లేఖను రాసి పెట్టింది. తన మరణానికి ఎవరు కూడా కారణం కాదని ఆమె ఆ లేఖలో రాసింది.












Click it and Unblock the Notifications