విమానంలో ప్రయాణికుల బందీ
వాషింగ్టన్: ఒక సాయుధ ఆగంతకుడు ఐదుగురు విమాన సిబ్బందిని, ఇద్దరు ప్రయాణికులను తన బందీలుగా తీసుకున్నాడు. ఈ సంఘటన సోమవారంనాడు జమైకాలోని మోంటిగో బేలో జరిగింది. మరో 167 ప్రయాణికులను అతను వదిలేశాడు. ఆ సాయుధ వ్యక్తి తొలుత విమానంలోని ప్రయాణికులందరినీ బందీలుగా చేశాడు.
ఆగంతకుడు ఒక రౌండ్ కాల్పులు జరిపాడని, అయితే ఇందులో ఎవరూ గాయపడలేదని రేడియో జమైకా తెలియజేసింది. తప్పుడు గుర్తింపు కార్డుతో విమానాశ్రయం భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకున్న ఆగంతకుడు విమానంలోకి ప్రవేశించాడని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగింది.












Click it and Unblock the Notifications