వరుణ్ గాంధీ కి సుప్రీం రిలీఫ్

తనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగించిన నాసాను కొట్టివేయాలని వరుణ్ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. రాష్ట్ర సలహా బోర్టు తనపై నాసా ప్రయోగాన్ని ఎత్తేయాలని నిర్ణయించినందున తనపై నాసాను కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఆ మేరకు వరుణ్ గాంధీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ముందు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సలహా సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ తో పాటు ఈ పిషటిన్ పై కూడా విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది.












Click it and Unblock the Notifications