తెలంగాణ తప్పు దిద్దుకుంటా: గద్దర్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ ఉద్యమాన్ని బలహీన పరిచారని ఆయన విమర్శించారు. వందేళ్లు గడిచినా ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్రం రాదని ఆయన అన్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, నెల రోజులు అస్పత్రిలోనే ఉన్నానని ఆయన చెప్పారు. తాను సాంస్కృతిక ఉద్యమాన్ని మాత్రమే నడిపిస్తానని ఆయన చెప్పారు. ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications