తమిళనాడు డిసిఎంగా స్టాలిన్

తన సోదరుడు ఆళగిరి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రసాయనాలు, ఎరువుల మంత్రిగా చేరిన మర్నాడే స్టాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా నియమితులు కావడం గమనార్హం. తన వారసుడిగా స్టాలిన్ ను రాష్ట్రంలో నిలబెట్టి కేంద్రంలో అళగిరి, తన మనవడు దయానిధి మారన్ లను ఉంచాలనే తన వ్యూహాన్ని కరుణానిధి పకడ్బందీగా అమలు చేశారు.
ఇక రాజ్యసభ సభ్యురాలు, కవయిత్రి అయిన తన కూతురు కనిమొళికి కరుణానిధి ఏం స్థానం కల్పిస్తారో వేచి చూడాల్సిందే. స్టాలిన్ 1969 ఎన్నికల్లో ప్రచారం చేయడం ద్వారా తన 14వ యేటనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1973లో డిఎంకె జనరల్ కమిటీకి ఎన్నికయ్యారు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ మీసా కింద అరెస్టు కావడంతో స్టాలిన్ పేరు రాజకీయాల్లో మారుమోగిపోయింది. 1983 నుంచి నాలుగు సార్లు చెన్నైలోని థౌజండ్ లైట్ నియోజర వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన ఆ తర్వాత విజయం సాధించారు. 2006లో ఆయన కరుణానిధి మంత్రి వర్గంలో చేరారు.












Click it and Unblock the Notifications