బాబూ! ఆత్మవిమర్శ చేసుకో: పురంధేశ్వరి

Purandeswari
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మ విమర్శ చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ వారసులమని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఆ విషయంలో చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకోవడం అవసరమని ఆమె అన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రిగా తిరిగి నియమితులైన విశాఖ లోకసభ సభ్యురాలు, స్వర్గీయ ఎన్టీఆర్‌ కుమార్తె ఆమె హైదరాబాద్‌ వచ్చారు. గురువారం ఎన్టీఆర్‌ జయంతిరోజు ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండటంతో కుటుంబసభ్యులతో నివాళులు అర్పించలేదు. శుక్రవారం ఉదయం మొదట ఆమె ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించి తండ్రికి నివాళులు అర్పించారు.

తండ్రి ఆశీస్సులు తనకు ఉండబట్టే తనకు కలిసివస్తోందని ఆమె అన్నారు.మానవ వనరుల శాఖపై తనకు పట్టు ఉండడం వల్లే ఆ శాఖను తనకు తిరిగి అప్పగించారని ఆమె చెప్పారు. జన్మజన్మలకూ ఎన్టీఆర్ తనయగానే పుట్టాలని కోరుకుంటానని ఆమె అన్నారు. తండ్రి ఎన్టీఆర్ ఆశీస్సులు తనకు ఉండడం వల్లనే ఆయన జయంతి రోజే తనకు మంత్రి పదవి దక్కిందని పురంధేశ్వరి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+