హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాహనశ్రేణిలోకి గురువారం అకస్మాత్తుగా ఓ అగంతకుడి ద్విచక్రవాహనం దూసుకొచ్చింది. శాసనసభా సమావేశాల అనంతరం చంద్రబాబు తన నివాసానికి వెళ్తుండగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర ఈ సంఘటన జరిగింది.
జామర్ ఉన్న వాహనానికి, బాబు వాహనానికి మధ్య ఆ బైక్ రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అంతలోనే ఆగంతకుడు వాహనశ్రేణి నుంచి బయటపడి దూసుకుపోయాడు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక కావాలని ఎవరైనా చేశారా అనేది తెలియలేదు.