పాక్ అణ్వాయుధాలు వాడ్తాం: తాలిబాన్
దుబాయ్: అవకాశం లభిస్తే అమెరికా వ్యతిరేక పోరాటంలో తాము పాకిస్తాన్ అణ్వాయుధాలు వాడుతామని తాలిబాన్ ప్రకటించింది. అణ్వాయుధాలు అమెరికా చేతిలో పడకూడదనేది దేవుడి ఆకాంక్ష అని, ముజాహిదీన్ వాటిని తీసుకుని అమెరికాపై ప్రయోగిస్తుందని తాలిబాన్ నాయకుడు ముస్తఫా అబూ ఆల్ యాజిద్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో అన్నాడు.
స్వాత్ లో పాకిస్తాన్ సైన్యం ఓడిపోతుందని, అమెరికాను దెబ్బ తీస్తామని అతను అన్నాడు. బహిరంగంగా నిరంతరాయంగా ఆ పని చేయడం ద్వారా దాన్ని సాధిస్తామని, ఇస్లాం, ముస్లింల ప్రయోజనాలు కాపాడడానికి కొత్త ఫ్రంట్ లను తెరుస్తామని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications