టిడిపి ఎమ్మెల్యే రామారావు అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు టీవీ రామారావును పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. కళాశాలలో విద్యార్థిపై అత్యాచారం జరిపి ఆమెను హత్య చేసినట్లు రామారావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై బనాయించిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రామారావు సోమవారం ఉదయం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
రామారావు నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తెలుగుదేశం నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆమరణ నిరాహార దీక్షకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో రామారావును అరెస్టు చేసి పోలీసు స్షేషనుకు తరలించారు.












Click it and Unblock the Notifications