హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తుకు తాము ఎలాంటి ప్రయత్నం చేయటం లేదని చిరంజీవి అన్నారు. రెండు రోజుల్లో గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేయనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. టిడిపికి దూరంగా ఉంటే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటామని చిరంజీవి అన్నారు. వామపక్షాలతో పొత్తు కుదరకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని స్ధానాలకూ పోటీ చేయాలని ప్రజారాజ్యం యోచిస్తున్నట్టు కన్పిస్తోంది.