మాకు పేరొస్తుందనే అక్కసు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తమకు పేరొస్తుందనే బాధతోనే ప్రతిపక్షాలు సహకార సేద్యాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తాను ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని పట్టుబట్టిన సందర్భంలో ఆయన సోమవారం శాసనసభలో ఆ వ్యాఖ్య చేశారు. సహకార వ్యవసాయంపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో మండలానికో గ్రామంలో ప్రయోగాత్మకంగా సహకార సేద్యాన్ని ప్రారంభిస్తామని, అక్కడ విజయవంతం చేసి చూపుతామని ఆయన అన్నారు. తాను సహకార సేద్యంపై చర్చకు సిద్ధమేనని చెప్పారు.

సహకార సేద్యంపై ప్రతిపక్షాలది మోసపూరిత వైఖరి అని ఆయన అన్నారు. రైతులు బాగుపడితే ప్రతిపక్షాలు భరించలేకపోతున్నాయని ఆయన అన్నారు. సహకార సేద్యం అమలైతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్పుద్ధితోనే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+