భోపాల్: తాను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తో కలిసి పనిచేయబోనని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెగేసి చెప్పింది. తన వృత్తిపరమైన నిర్ణయాల్లో బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ ప్రమేయం లేకుండా ఆమె చూసుకుంటున్నప్పటికీ తాను వివేక్ ఒబెరాయ్ తో కలిసి నటించబోనని ప్రకటించడం ఆశ్చర్యకరమే. తాను వివేక్ తో కలిసి పనిచేయబోనని మీడియా ప్రతినిధులతో చెప్పింది. ఐశ్వర్యా రాయ్ తో సంబంధాల విషయంలో తనను సల్మాన్ ఖాన్ చంపుతానని బెదిరించాడని, వేధించాడని గతంలో వివేక్ ఒబెరాయ్ ఆరోపించాడు.
తాను సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటానని, తన నిర్ణయాల్లో సల్మాన్ పాత్ర లేదని కత్రినా చెప్పింది. ఆమె ఇటీవలి న్యూయార్క్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అందుకు ఆమె భగవంతుడికి, ప్రజలకు కృతజ్ఝతలు తెలిపింది.