ఈ రాత్రికి ప్రణబ్ తో కెవిపి భేటీ

రాష్ట్ర పరిస్థితులను తాను పార్టీ నేతలకు వినిపిస్తున్నానని కెవిపి చెప్పారు. జగన్ కు రాష్ట్ర శాసనసభ్యుల మద్దతు ఉందనే విషయం పార్టీ అధిష్ఠాన వర్గానికి తెలియదని తాను అనుకోవడం లేదని, పార్టీ అధిష్ఠాన వర్గానికి అన్ని విషయాలు తెలుసునని ఆయన ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో సోనియా గాంధీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications