లాడెన్ మరణించాడు: జర్దారీ

తాను పదవి చేపట్టి ఏడాది గడిచిన సందర్బంగా ఆయన బిబిసికి ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ ఆర్థిక పరిస్థితి మెరుగుకు పాశ్చాత్య దేశాల నుంచి మరింత సహాయం కావాలని ఆయన అన్నారు. అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల అణచివేతకు తనకు మరింత సమయం, మరిన్ని వనరులు అవసరమని అభిప్రాయపడ్డారు. తాలిబాన్ మిలిటెంట్లపై తాము కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. లాడెన్ మరణించాడని ధృవీకరించే ఆధారాలను ఆయన చూపలేకపోయారు.












Click it and Unblock the Notifications