హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'రోశయ్య పదవి చట్ట విరుద్ధం'

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: శాసన సభాపక్షనేతగా ఎన్నిక కాని వ్యక్తి సీ ఎంగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని ప్రముఖ‌ న్యాయవాది , మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్‌.రామచంద్రరావు పేర్కొన్నారు. వైఎస్‌ ఆకస్మిక మృతితో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి రోశయ్యను సీఎంగా గవర్నర్‌ నియమించారని ఇప్పు డు రోశయ్య సభ విశ్వాసం చూరగొనాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఇంతవరకు ఆ చట్టబద్ధమైన విధిని నెరవేర్చకుండా దాటవేత ధోరణి అనుసరిస్తున్నందున, హైకోర్టులో కో-వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి రాజ్యాంగం అనుమతిస్తుందన్నారు. మంగళవారం ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. 'సహజంగా మెజారిటీ ఉన్న శాసనసభా పక్ష నేతను గవర్నర్‌ ఆహ్వానించాలి.

సీఎల్‌పీ సమావేశం నిర్వహించకుండా, నేతను ఎంపిక చేయకుండానే రోశయ్యతో సీఎంగా గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందిన 156 మంది ఎమ్మెల్యేల మద్దతు సీఎంకు ఉంటుందని గవర్నర్‌ భావించి ఉండొచ్చు. అయితే 146 మంది ఎమ్మెల్యే లు జగన్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో సీఎం పదవి రాజ్యాంగ సంక్షోభంలో పడింది.

రాజ్యాంగ సంప్రదాయాలు, ప్రజాస్వా మ్య సూత్రాలు పాటించకుండా రోశయ్య సీఎంగా కొనసాగడం చట్టవిరుద్ధమే' అని రామచంద్రరావు స్పష్టం చేశారు. దీనిని సవాల్‌ చేస్తూ నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి బెజవాడ గోవిందరెడ్డి తరఫున రిట్‌ ఆఫ్‌ కో వారెంట్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ పిటిషన్‌ అక్టోబర్‌ 5న హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు.

చాలామంది శాసనసభ్యులు, మంత్రులు జగన్‌కు అనుకూలంగా ఉన్నారని గుర్తు చేశారు. 'సీఎల్పీ కూడా జగన్‌కు అనుకూలంగా ప్రకటన చేసింది. రాజ్యాంగం ప్రకారం సభలో రోశయ్య మెజార్టీని రూపించుకోవాల్సి ఉంది. రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఎంపికైన శాసనసభా పక్ష నేత సీఎంగా కొనసాగాలి. నామినేషన్‌పై నియమితులైన వారు ఉండరాదు.

సాధారణంగా శాసనసభాపక్షం ఎన్నుకున్న నేతను గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించి, రెండు మూడు వారాల్లో బల నిరూపణ చేసుకోవాల్సిందిగా కోరతారు. రోశయ్య సీఎల్పీ నేతగా ఎన్నికకాలేదు. నా దృష్టిలో తక్షణం సభను సమావేశపరిచి బల నిరూపణ చేసుకోవాల్సిందే' అని రామచంద్రరావు పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X