చంద్రబాబుకు జూ. ఎన్టీఆర్ షాక్

జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ట్రస్టుకు తన విరాళాన్ని అందించకపోవడంలోని ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇటీవలి శాసనసభ, లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం సాగించారు. అయితే ఆయన పర్యటించినప్పటికీ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా లాభం జరగలేదు. దానికి తోడు, ప్రచారం నుంచి తిరిగి వస్తూ ఆయన పెద్ద ప్రమాదానికి గురై బయట పడ్డారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ యువజన విభాగం తెలుగు యువత సారథ్య బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడానికి చంద్రబాబు ఇష్టంగా లేరని చెబుతున్నారు. దానికి తోడు కుటుంబ రాజకీయాలు కూడా ఆయనను చంద్రబాబుకు దూరం చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications