హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇటు ఎక్స్ ప్రెస్ వే: అటు గ్రేటర్ ఎన్నికలు

By Pratap
|
Google Oneindia TeluguNews

PV Express Way
హైదరాబాద్: దేశంలోనే అతి పొడవైన ఫ్లై ఓవర్ హైదరాబాదులో సోమవారం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం సాయంత్రం దీన్ని ప్రారంభించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని పొడవు 11.6 కిలోమీటర్లు. దాదాపు 36 నెలల పాటు దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి సుమారు 600 కోట్ల రూపాయల ఖర్చయ్యాయి. షంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. మెహిదీపట్నం నుంచి షంషాబాద్ వెళ్లడానికి రద్దీ వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పివి ఎక్స్ ప్రెస్ వే వల్ల ఈ జాప్యం పూర్తిగా తొలగిపోతుంది. కేవలం 15 నిమిషాల్లోనే అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి వీలవుతుంది.

హైదరాబాదులోని మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు అత్యంత పొడవైన ఈ ఎక్స్ ప్రెస్ వేను నిర్మించారు. నిజానికి, 2008లోనే ఇది ప్రారంభం కావాల్సి ఉంది. దీని నిర్మాణంలో పది నెలల జాప్యం జరిగింది. దీనికి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి దానికి ఖరారు చేశారు. దీంతో అదే పేరును కొనసాగించాలని రోశయ్య ప్రభుత్వం నిర్ణయించింది. 2000 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దీనికి పునాది రాయి వేశారు. ఇది ఫోర్ వే ఎక్స్ ప్రెస్ వే. నాలుగు చక్రాల వాహనాలను మాత్రమే దీనిపై అనుమతిస్తారు.

ఇటు ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం కాగానే అటు ఎన్నికల కమిషనర్ ఎవియస్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X