నేపాల్ రాజకీయాల్లో చేరుతా: మనీషా

ఆమె ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా, తన కుటుంబ సభ్యులున్న నేపాలీ కాంగ్రెసు పార్టీలో చేరుతారా అనేది తెలియడం లేదు. అయితే రాజకీయాల్లో చేరే విషయంపై పట్టింపుతోనే ఉన్నారు. తాను ముంబైలో రెండు సినిమాలను పూర్తి చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. రాజకీయాల్లో చేరాలనే ఆలోచన ఇంకా మొలక దశలోనే ఉందని ఆమె అన్నారు. తాను రాజకీయాల్లో చేరితే తన స్వదేశంలో ఎక్కువ కాలం గడపాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. రాజకీయాల్లో పనిచేస్తూనే సినీ రంగంతో ఏదో విధమైన పాత్రను పోషించాలనే ఆలోచనతో కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications