వాడి తండ్రి చిరంజీవి, అందుకే అంత ఎత్తుకు...

ఆయన మాటల్లోనే కొన్ని విషయాలు: "మా ఫాదరేం చిరంజీవి కాదు. వాడి బాబు చిరంజీవి. అందుకనే వాడు నన్ను ప్లాట్‌ఫాం చేసుకుని ఎదిగాడు కాబట్టి నాకన్నా ఎత్తులో కనపడతాడు!.. నాతో కలిసి నటించాలని చరణ్ కోరిక. మగధీరలో కాసేపు మమ్మల్నిద్దరినీ తెరమీద చూసినపుడు, మొత్తం సినిమా చేస్తే బాగుంటుందని నా భార్య సురేఖ కూడా అన్నది. ఇంట్లో సినిమా అలవాటైన మాకే అలా ఉంటే, మమ్మల్ని తెరమీద చూసి అభిమానించేవాళ్లకు ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ల కోరిక బలంగా ఉంటే బహుశా జరగచ్చు. తథాస్తు దేవతలు కూడా అలాగే అంటే శిరసావహిస్తాను..."












Click it and Unblock the Notifications