హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వందస్థానాలకు పైగా డివిజన్లను గెలుచుకుంటామని వైద్య,ఆరోగ్యశాఖమంత్రి దానం నాగేందర్ అన్నారు. ఎల్లుండినుంచి గ్రేటర్‌లో కాంగ్రెస్ ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షపదవికి రాజీనామా చేసినా యుద్దరంగం నుంచి తప్పుకోలేదని నాగేందర్ అన్నారు.
దానం నాగేందర్ నిన్న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టికెట్లు అమ్ముకున్నారన్న వార్తలు రావడంతో మనోవేదనతో తాను రాజీనామా చేశానని నాగేందర్ చెప్పుకున్నారు.