కాంగ్రెసును మట్టి కరిపిస్తాం: బాబు

హైదరాబాద్ తమ పార్టీకి కంచుకోట అని, కులమతాలకు అతీతంగా ప్రజలు తమ పార్టీని బలపరుస్తామని ఆయన అన్నారు. మత ఉద్రిక్తతలో అట్టుడికే హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేసింది తమ పార్టీయేనని ఆయన అన్నారు. కాంగ్రెసు మజ్లీస్ తో లోపాయికారి పొత్తు పెట్టుకుందని, ఆ పొత్తు తమ పార్టీని ఏమీ చేయలేదని ఆయన అన్నారు. పొత్తుతో గెలుస్తామని కాంగ్రెసు, మజ్లీస్ కలలు కంటున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంతా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications