పార్టీని కాంగ్రెసులో విలీనం చేయం: చిరు

కాంగ్రెసుతో తాము స్నేహపూర్వకంగా ఉన్నామనే మాటలో వాస్తవం లేదని, తాము ప్రభుత్వంపై పోరాడుతామని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీకి ఓటేయవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు చెబుతున్నారని, తాము తగిన స్థానాలు గెలిచి చంద్రబాబుకు సమాధానం ఇస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన విమర్శించారు. మంచినీటికి కూడా ఇబ్బందే ఉందని ఆయన అన్నారు. చిన్న పర్షం పడితే హైదరాబాద్ రోడ్లు నీటితో నిండిపోతున్నాయని ఆయన అన్నారు. అధిక ధరలతో ప్రజలు సతమతమవుతున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications