తలుచుకుంటే కెసిఆర్ ఇల్లు ఖాళీ చేయిస్తా: తలసాని

ఎన్నికల సమరం నుంచి పారిపోయిన కెసిఆర్ కు హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి బలం నిరూపించుకుంటే హైదరాబాద్ మీది అని అనుకునేవాళ్లమని ఆయన అన్నారు. కాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలపై తెరాస మాజీ శాసనసభ్యుడు దొమ్మాట రామలింగారెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తలసాని తన స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సిద్ధిపేటలో మహిళలు తలసాని శ్రీనివాస యాదవ్ ను తరిమి కొట్టారని, ఆ విషయాన్ని తలసాని గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications