తలొగ్గిన జగన్: పోటీకి దూరం

YS Jaganmohan Reddy
హైదరాబాద్: పులివెందుల శాసనసభా నియోజక వర్గం నుంచి పోటీ విషయంలో కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తలొగ్గారు. తాను పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన తల్లి విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని పులివెందులకు ఖరారు చేసినట్లు సోనియా తనకు చెప్పినట్లు వైయస్ జగన్ స్వయంగా వెల్లడించారు. కాగా, పోటీకి విజయలక్ష్మి పోటీకి విముఖంగా ఉన్నారు. తాను తల్లిని ఒప్పిస్తానని జగన్ బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తన తల్లిని ఒప్పించాల్సిన బాధ్యత తన మీదనే ఉన్నదని ఆయన చెప్పారు.

తన తల్లి విజయలక్ష్మి అంగీకరించకపోతే మరొకరిని ఒప్పించాల్సిన బాధ్యతను కూడా తనపైనే పెట్టారని ఆయన అన్నారు. తాను పోటీ చేస్తే పార్లమెంటు సీటును వదులుకోవాల్సి ఉంటుందని, దాని వల్ల మళ్లీ పార్లమెంటు సీటుకు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుందని, అందువల్ల తన పోటీకి సోనియా ఇష్టపడలేదని ఆయన వివరించారు. సోనియా చెప్పిన తర్వాత పోటీకి విజయలక్ష్మి వెనక్కి వెళ్లకపోవచ్చునని అంటున్నారు. విజయలక్ష్మి పోటీ చేయడాన్ని తాను ఊహించలేకపోతున్నానని, ఆమె అంత కన్నా పెద్ద పదవిలో ఉండాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+