న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌ను భారత్‌లో నిషేధించాలని బుధవారం సిపిఎం నేత బృందాకరత్ కేంద్రాన్ని డిమాండ్ చేసారు. లింగ నిర్థరణ పరీక్షలకు సంబంధించిన సమాచారం నెట్‌లో ఉంచుతూ ఇక్కడి చట్టాలను గూగుల్ యథేచ్చగా ఉల్లంఘిస్తోందని ఆమె మండిపడ్డారు.
ఈ విషయంలో ఇదివరకు భారత్ ఒకసారి గూగుల్ యాజమాన్యాన్ని హెచ్చరించిన విషయాన్ని బృందాకరత్ గుర్తుచేసారు. గూగుల్ భారత విభాగం అధిపతిని తక్షణమే అరెస్టు చేసి ఈ అంశంపై విచారణ జరపాలని బృందాకరత్ డిమాండ్ చేసారు.