సీమాంధ్రలో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్

కాగా, హైదరాబాదులోని థియేటర్లలో పోలీసుల బందోబస్తు మధ్య సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. అయితే ఎన్టీఆర్ సినిమాకు ఉండే భారీ ఓపెనింగ్స్, అభిమానుల సందడి హైదరాబాదులో కనిపించడం లేదు. కొన్ని థియేటర్ల వద్ద ప్రేక్షకులు బారులు తీరినప్పటికీ పెద్దగా సందడి లేదు. దిల్ షుక్ నగర్ వంటి ప్రాంతాల్లో బారులు కూడా లేవు. మహిళలు థియేటర్ల వద్ద కనిపించడం లేదు. మెదక్ జిల్లా సదాశివపేటలో తెలంగాణవాదుల విజ్ఞప్తి మేరకు సినిమా ప్రదర్శనను నిలిపేశారు. ఆదిలాబాదు లో కూడా సినిమా ప్రదర్శన నిలిపేశారు. హైదరాబాదులో థియేటర్లు నిండుతాయనే ఆశాభావం మాత్రమే వ్యక్తమవుతుంది. టికెట్ల కోసం ఎగబడి తిప్పలు పడే పరిస్థితి మాత్రం లేదు.


Click it and Unblock the Notifications