కె చంద్రశేఖర రావు ప్రైవేట్ లిమిటెడ్ తెరాస: దానం నాగేందర్

ఒత్తిడి తెచ్చి, బలవంత పెట్టి పొందే సహకారం వల్ల ఉపయోగం ఉండదని, ఇష్టానుసారం సహకరాం పొందేలా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాదులో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు త్వరలో శాంతిర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. శాంతి ర్యాలీకి అన్ని వర్గాల ప్రజలను, అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చినా అందరం కలిసి ఉంటామనే సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సినీ పరిశ్రమకు ఇబ్బందులు కలిగించడం తెలంగాణ అభివృద్ధికి దోహదపడదని ఆయన అన్నారు. ఇలాగే చేస్తే ఇతర పరిశ్రమలు కూడా రాకుండా పోతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications