మంత్రివర్గంలో టిజి వెంకటేష్ కు స్ధానం?

TG Venkatesh
కర్నూలు: త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేష్ కు స్ధానం దక్కవచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా మూలనపడిన మంత్రివర్గ విస్తరణ కసరత్తు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశలున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రివర్గంలో జిల్లానుంచి శిల్పామోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

విస్తరణ జరిగినా శిల్పా కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకుల అంచనా. అందులో భాగంగా రాయలసీమ జిల్లాల నుంచి జెసి దివాకర్‌ రెడ్డి, టిజి వెంకటేష్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎమ్మెల్యే టీజీతో పాటు, సీనియర్‌ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరికి స్థానం దక్కుతుందో అంతుబట్టడం లేదు. ముఖ్యమంత్రి రోశయ్యతో ఎమ్మెల్యే టీజీ ఉన్న సన్నిహిత సంబంధాలు, బంధుత్వాల నేపథ్యంలో ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కొందరు పేర్కొంటున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ లభించినందునే ఎమ్మెల్యే నింపాదిగా ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా తనదైన శైలిలో కాంగ్రెస్‌ పెద్దల సహకారంతో మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యేనయిన తనకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలకు వివరించడమేగాక, ఢిల్లీలో తనకు సన్నిహితంగా ఉన్న ముఖ్య నేతల ద్వారా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+