వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా గోలీమార్ కు తెలంగాణ దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: రోజా నటిస్తున్న గోలీమార్ సినిమా షూటింగ్ ను తెలంగాణవాదులు సోమవారం అడ్డుకున్నారు. హైదరాబాదులోని కూకట్ పల్లిలోని రైతు బజారులో ఆ సినిమా షూటింగ్ ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాడి జరుగుతుందనే భయంతో రోజా అక్కడి నుంచి వెనుదిరిగారు. సినిమా ప్రొడక్షన్ యూనిట్ ముందు అనుమతి తీసుకోలేదని, అనుమతి తీసుకుని ఉంటే రక్షణ కల్పించి ఉండేవారమని పోలీసు అధికారులు చెప్పారు.

తన షూటింగ్ ను అడ్డుకోవడంపై రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. తన భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని ఆమె ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తనపై కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తనపై కుట్ర జరిగిందని, దాంతో విసిగిపోయి తన సినీరంగంలోకి తిరిగి వస్తే ఇక్కడా ఏదో కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. సినిమా షూటింగ్ లకు రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారని, కానీ అందుకు విరుద్దంగా పరిస్థితి ఉందని ఆమె అన్నారు.

తెలంగాణలో సినిమా షూటింగులను అడ్డుకోవద్దని, రాజకీయ నాయకులను నిలదీయాలని, తెలంగాణ అంశం సినీ నటుల చేతుల్లో ఉందని, తమను ఇబ్బంది పెట్టడం ద్వారా ఉపయోగం లేదని ఆమె అన్నారు. తెలంగాణపై రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిని నిలదీయాలని, ఒక్క ప్రజాప్రతినిధి కూడా రాజీనామా సరిగా చేయలేదని, దీన్ని బట్టి వారి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X