హైదరాబాద్: రాష్ట్రంలో మరింత విద్యుత్ కోత తప్పదేమోనని ముఖ్యమంత్రి కె రోశయ్య అన్నారు. ప్రకాశం జిల్లా నేతలతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన ఆ అభిప్రాయం వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, గత వారం రోజులుగా విద్యుత్ సరఫరాపై ఒత్తిడి పెరిగిందని, ఇది ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
విద్యుత్ డిమాండ్ కు, సరఫరాకు మధ్య తీవ్రమైన అంతరం ఉందని ఆయన అన్నారు. రైతులకు సరఫరా చేస్తున్న ఏడు గంటల విద్యుత్తును రెండు విడతలుగా ఇస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు గంటపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరింత విద్యుత్ కోతపై ఎపి ట్రాన్స్ కో కసరత్తు చేస్తోంది.