రోశయ్యతో శ్రీకృష్ణ కమిటీ సభ్యుల భేటీ

అభిప్రాయ సేకరణ కోసం తమకు కావాల్సిన అవసరాలపై కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలుస్తోంది. నోడల్ అధికారి రాజీవ్ శర్మతో కూడా వారు మాట్లాడారు. తెలుగులో, ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రజలు వెల్లడించే అభిప్రాయాలను ఆంగ్లంలో, హిందీలో అనువాదం చేసి వివరించడానికి తగిన వ్యక్తులు కావాలని వారు రోశయ్యను అడిగినట్లు తెలుస్తోంది.
శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురువారం హైదరాబాదు చేరుకున్నారు. గురువారం సాయంత్రం వారు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. శుక్రవారం కొంత మంది కాంగ్రెసు నాయకులు శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కలిసే అవకాశం ఉంది. జానారెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కలుస్తారని అంటున్నారు. వారు ఈ సాయంత్రం ఢిల్లీ తిరిగి వెళ్తారు.