వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెనక్కి తగ్గిన లాలూ, ములాయం

ఇప్పుడే ఏమీ లేదని, ఆ విషయంపై తాము ముందు చర్చించుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని, తమకు తగిన సంఖ్యాబలం లేదని ములాయం సింగ్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీకి లోకసభలో 21 మంది సభ్యులున్నారు. యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంలో కూడా ముందుకు సాగే పరిస్థితిలో ఉన్నట్లు వారు కనిపించడం లేదు. తాము రాష్ట్రపతిని కలుసుకోవడం లేదని ఆయన అన్నారు.
తాము అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించడానికి ఆలోచన చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తమకు నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారని, అందువల్ల అది సాధ్యం కాదని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. తాము రాష్ట్రపతిని సమయం అడిగామని, అయితే ఇంత వరకు తమకు సమాచారం లేదని ఆయన అన్నారు.