నెల్లూరు: మేయర్ భానుశ్రీ ఇంటిపై దాడుల సంచలనం

'ఇప్పటికే అయిదు రోజుల నుంచి అన్నం ముట్టడం లేదు. ఈ విషయం మా ఇంట్లోవాళ్లకు తెలియదు..ఇప్పుడు పరిస్థితినిబట్టి బయటకు చెబుతున్నా. నన్ను, నా కుటుంబసభ్యులను అల్లరి పెట్టేందుకే ఏసీబీ దాడులు చేయించారు. అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాము' అని భానుశ్రీ పేర్కొన్నారు. తనవి అక్రమ ఆస్తులని నిరూపించాలని ఆమె సవాలు విసిరారు.
నెల్లూరు మేయర్ భానుశ్రీని లక్ష్యంగా చేసుకొని ఆమె భర్త, నగర ట్రాన్స్‌కోలో డివిజనల్ ఇంజినీరుగా పనిచేస్తున్న నందిమండలం వెంకటశివ సుబ్బరాజు ఇళ్లపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టరు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఏకకాలంలో సుబ్బరాజు నివాసంపైన, భానుశ్రీ సన్నిహితుల ఇళ్లపైనా ఈ దాడులు జరిగాయి.