హైదరాబాద్ లో బాడీ బిల్డర్ హత్య

వినోద్‌కుమార్ హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వినోద్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. రెండో భార్య విజయలకి కూడా ఇతనిపై విడాకుల కేసు వేసింది. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణలో ఉంది. డాగ్‌స్క్వాడ్ వినోద్ గదిలోని అల్మరాలో దాచిన డంబెల్‌ను గుర్తించింది. దానికి రక్తపు మరకలు అంటి ఉండటంతో వినోద్‌కుమార్ తల మీద దానితోనే మోది దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఇంటి నుంచి బయటకు వచ్చిన శునకం ప్రధాన రహదారి వద్ద ఉన్న ఆటో స్టాండ్ వరకు వచ్చి ఆగిపోయింది.
వినోద్‌కుమార్ మద్యం మత్తులో ఉండగా తెలిసిన వారే హత్య చేసి ఉంటారనే నిర్ధారణకు వస్తున్నారు. హత్తున్ని సుజనమ్మ శనివారం రాత్రి చూచినట్లు పోలీసులకు చెప్పింది. మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications