నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మంగళవారం డిగ్రీ ఎకనమిక్స్ ప్రశ్నపత్రం లీకయింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో గల ఎస్ ఆర్జె కళాశాలలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఇన్విజిలేటర్ ప్రశ్నపత్రాన్ని బయటకు పంపినట్లు అనుమానిస్తున్నారు. ఇంకేమైనా లీక్ వ్యవహారాలున్నాయా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఈ విషయాన్ని అధికారులు గానీ పోలీసులు గానీ ధ్రువీకరించడం లేదు.
ఇటీవలి కాలంలో ప్రశ్నల లీక్ వ్యవహారం సాధారణ విషయంగా మారింది.వివిధ పరీక్షల్లో ప్రశ్న పత్రాలు లీకవుతున్నాయి. వీటి పట్ల అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు.