మిర్యాలగూడలో కాలినడకన ఎస్పీ తనిఖీలు

గత రెండు రోజు లుగా హైదరాబాద్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్న దృష్ట్యా అనుమానితుల కోసం గాలింపు చర్యల్లో భాగంగా తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ రాజేశ్‌కుమార్ పట్టణానికి చేరుకున్న వెంటనే స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాంచంద్రారెడ్డితో సుమారు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. పలు రికార్డులను పరిశీలించినట్లు సమాచారం.
అనంతరం ఎన్‌ఎస్‌పీ అతి«థిగృహం పక్కన పట్టణ వన్ టౌన్, టూ టౌన్ పోలీస్‌స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా సాగర్ రోడ్డుపై నడుచుకుంటూ పట్టణంలోని జనాభా, ట్రాఫిక్ పరిస్థితులపై డీఎస్పీ రామచంద్రారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సాగర్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ లోని కూరగాయల మార్కెట్‌కు వెళ్లి పరిశీలించారు. మార్కెట్‌లో పాదచారులు నడిచే స్థలంలో కూరగాయలను విక్రయించరాదని ఆదేశించారు. అదే విధంగా వన్‌టౌన్, టూటౌన్, సర్కిల్ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్‌స్టేష న్లను పాత మున్సిపాలిటీ కార్యాలయంలోకి మార్చనున్నందున ఆ భవనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా రాజీవ్‌చౌక్ వరకు నడుచుకుంటూ పట్టణంలో సంచరించారు. ఆయన వెంట డీఎస్పీ ఈ. రామచంద్రారెడ్డి, పట్టణ ఎస్ ఐ చంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications