రష్యాలో పేలుళ్లు: 9 మంది మృతి

Twin Suicide Blasts in Russia's Dagestan
మాస్కో: రష్యాలో మరోసారి బాంబు పేలుళ్లు సంభవించాయి. రష్యాలోని దగేస్తాన్ ప్రాంతంలో గల కిజ్లియార్ పట్టణంలో బుధవారం రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. ఇందులో 9 మంది మరణించారు. మృతుల్లో స్థానిక పోలీసు చీఫ్ కూడా ఉన్నారు. పేలుళ్లలో 9 మంది మరణించిన విషయాన్ని ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ధ్రువీకరించింది.

పోలీసు యూనిఫారంలో ఉన్న వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో స్థానిక పోలీసు చీఫ్ విటలీ వెదెమికోవ్ మరణించినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తొలి పేలుడు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరిగింది. పాఠశాల వద్ద పేలుడు పదార్థాలతో నిండిన కారును డ్రైవర్ పేల్చేయడంతో ఈ దారుణం సంభవించింది. పోలీసు అధికారులు, స్థానికులు అక్కడ గుమికూడారు. ఆ తర్వాత అరగంటకు అక్కడే యూనిఫారం ధరించిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. సోమవారం మాస్కో మెట్రో రైల్వే స్టేషన్లలో సంభవించిన పేలుళ్లలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+