• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిఎస్ కు నో చాన్స్

By Pratap
|

D Srinivas
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు లభించలేదు. హైదరాబాద్ నుంచి రెండు, రంగారెడ్డి జిల్లా నుంచి రెండు స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి డిఎస్ ఆసక్తి కనబరిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే అధిష్టానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. రెండు స్థానాలకు పార్టీ అభ్యర్థులను డి. శ్రీనివాస్ శనివారం ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధుల స్థానం నుంచి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ను పోటీకి దించుతున్నారు. ఆయన శాసనసభ్యుల ప్రతినిధిగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన మన పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. కాగా, హైదరాబాదులోని ఒక స్థానం నుంచి ఎంఎస్ ప్రభాకర్ ను పోటీకి దించుతున్నారు. ఆయన మాజీ మంత్రి శ్యాంరావు కుమారుడు. ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ కు ఆయన సన్నిహితుడు. హైదరాబాదులోని మరో స్థానాన్ని మజ్లీస్ కు కేటాయిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X