ఎంసిఐ అధ్యక్షుడు కేతన్ అరెస్టు

కేతన్, ఇతరుల అరెస్టు వివరాలను సీబీఐ ప్రతినిధి హరీష్ బాహల్ శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. నిందితులకు ఢిల్లీలోను, ఢిల్లీవెలుపల ఉన్న ఇళ్లు, ఆస్తులపై సోదాలు ప్రారంభించినట్టు తెలిపారు. 2001లో అవినీతి ఆరోపణలపై ఢిల్లీహైకోర్టు తప్పుపట్టడంతో అప్పట్లో ఒకసారి ఎంసీఐ అధ్యక్షపదవి నుంచి కేతన్ తప్పుకున్నారు. తర్వాత మళ్లీ ఆ పదవిని చేజిక్కించుకున్నారు. అనేక వైద్య కళాశాలలకు అక్రమంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎంసీఐ అధ్యక్షుడి బాగోతంపై ప్రధాని కార్యాలయం ఆరా తీసింది. వివరాలు తెలపాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఆరోగ్య శాఖ మంత్రి ఆజాద్ మాత్రం ఎంసీఐ అధ్యక్షుడి నియామకం, తొలగింపులో ప్రభుత్వం పాత్ర ఉండదన్నారు.












Click it and Unblock the Notifications