హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి తెలంగాణవాదుల 'గ్రేటర్' షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీకి సోమవారం తెలంగాణవాదుల నుంచి గ్రేటర్ షాక్ తగిలింది. హైదరాబాదులోని అంబర్ పేటలో గ్రేటర్ హైదరాబాద్ పార్టీ కార్యకర్తల సమావేశానికి వచ్చిన చిరంజీవిని అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. చిరంజీవి సమావేశానికి వస్తారని తెలిసి తెలంగాణవాదులు పెద్ద యెత్తున గుమికూడారు. సమైక్యవాదాన్ని ప్రచారం చేస్తున్న చిరంజీవిని అడ్డుకుని తీరుతామని చెప్పిన తెలంగాణవాదులు ఉదయం నుంచే సమావేశ స్థలికి చేరుకున్నారు. అయితే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

సమావేశానికి వస్తున్న చిరంజీవిని మధ్యలో అడ్డుకోవడానికి తెలంగాణవాదులు కొందరు ప్రయత్నించారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని చిరంజీవికి అడ్డంకులు తొలగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో చిరంజీవి సమావేశానికి వచ్చారు. చిరంజీవి గోబ్యాక్ అంటూ తెలంగాణవాదులు నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X