వరంగల్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అరెస్టు వార్త విన్న కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. అరెస్టుతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే మద్దతుదారులు ఆమెను అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా వంగపల్లిలో జగన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అంతకు ముందు జగన్ కు స్వాగతం చెప్పడానికి మహబూబాబాద్ రైల్వే స్టేషనుకు వచ్చిన కొండా సురేఖపై తెలంగాణవాదులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె గాయపడ్డారు. దీంతో ఆమెను అస్పత్రికి తరలించారు.