• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పశ్చిమ బెంగాల్లో 8 మంది మావోయిస్టుల హతం

By Pratap
|

Maoists
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్‌లో మావోయిస్టులకు కోబ్రా దళాలకు జరిగిన ఎదురు కాల్పులో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మిడ్నాపూర్‌ లో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కోబ్రా దళాలతో పాటు బెంగాల్‌ రాష్ట్ర పోలీసులు కూడా పాల్గొన్నారు.

కాగా, బీహార్ లోని గయాలో ముగ్గురు మావోయస్టులను అరెస్టు చేసినట్లు సమాచారం. గయా జిల్లా మోహన్ పూర్ లో మావోయిస్టుల స్థావరంపై దాడి చేసి పోలీసులు వారిని అరెస్టు చేశారు. నక్సలైట్ల స్థావరం నుంచి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X